జిమ్ము కట్టి చూడు.. జిమ్ము చేసి చూడు.. ఇది ప్రగతి మాట!
on Aug 9, 2022
ప్రగతి ఆంటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ ఐపొతూ ఉంది. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమె చేసే జిమ్ వర్కౌట్స్ చూస్తే చాలు. ఏమాత్రం టైమ్ దొరికినా జిమ్ లో ప్రత్యక్షమై వర్కవుట్స్ చేస్తూ ఉంటుంది. లేటెస్ట్ జబర్దస్త్ ప్రోమో విడుదలయ్యింది. ఈ షోకి జడ్జిగా వచ్చి ప్రగతి నవ్వులు పూయించింది. ఇక ఈ ఎపిసోడ్ లో రాఘవ స్కిట్ గురించి ఒక్క మాటలో చెప్పలేం. అంత హిలేరియస్ గా ఉంది ఈ స్కిట్. రాఘవ ఈ స్కిట్ ని వెరైటీ గా పెర్ఫామ్ చేసాడు.
స్టేజి మీద ఎక్సరసైజ్లు చేస్తూ "ప్రగతి మేడం ఎప్పుడు చూసినా మీరు జిమ్ లోనే ఉంటారు. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేది పాత మాట మేడం, జిమ్ము కట్టి చూడు.. జిమ్ము చేసి చూడు అనేది ప్రగతి మాట అండి" అంటాడు. ఇంతలో రాఘవ అసిస్టెంట్ వచ్చి "ఏ వయసులో చేయాల్సినవి ఆ వయసులో చేయాలి జిమ్ములు" అంటాడు రాఘవతో. "ప్రగతి మేడంని అంత మాట అంటావా?" అంటాడు రివర్స్ లో రాఘవ. "నేను ప్రగతి గారిని అనలేదు నిన్ను అన్నాను" అంటాడు అసిస్టెంట్. తర్వాత నాగి అక్కడికి వస్తాడు. "మా దగ్గర ఒక గెస్ట్ ఉన్నాడు. అతన్ని ఒక మూడు రోజులు ఎక్కడ పెట్టాలో తెలియడం లేదు" అని రాఘవ అనేసరికి, "మా ఇంట్లో ఒక రూమ్ ఖాళీ ఉంది. ఐదు వేలు ఇచ్చి అందులో ఉంచు" అంటాడు నాగి.
వెంటనే డబ్బులు ఇచ్చేసి ఒక శవాన్ని తీసుకొచ్చి ఆ రూమ్ లో పెడతాడు. "ఇదిగోండి గెస్ట్ వచ్చేసాడు" అనేసరికి, "ఏమిటి మందు తాగి పడిపోయాడా?" అని అడిగాడు నాగి. "కాదు పురుగుల మందు తాగి పడిపోయాడు" అని చెప్తాడు రాఘవ. "ఇదేంటి లేవడం లేదు" అని డౌట్ తో అడిగాడు నాగి. "శవం ఎలా లేస్తుంది?.. ఐనా మార్చురీలో పని చేసే నేను శవాల్ని కాక పప్పు చెక్కల్ని తెచ్చి పెడతాను ఏమిటి" అంటాడు. ఆ మాటకు షాక్ ఐపోతాడు నాగి.
Also Read